గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మధురాన్నం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి, హోంమంత్రి సుచరిత, జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల.. ఉచిత భోజనశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజును అభినందించారు.
రెండు పూటలా ఉచితంగా భోజనం అందిచటం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్జీవోల అసోసియేషన్ కృషితో ఆస్పతికి వచ్చే రోగుల బంధువుల కోసం విశ్రాంతి గృహ నిర్మాణం చేపట్టడం సంతోషకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: