కొవిడ్ విపత్కర పరిస్థితులలో బాధితులకు సేవలందించిన డాక్టర్లకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) జాతీయ కమిటీ పురస్కారాలు అందించింది. మెుదటి వరసలో నిలబడి రోగుల ప్రాణాలు కాపాడిన వైద్యులకు 'కొవిడ్ వారియర్ పురస్కారాలను' ప్రదానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవార్డుకు ఆరుగురు ఎంపిక కాగా.. వారిలో తెనాలి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఉమామహేశ్వరరావు ఉన్నారు.
సాధారణ జీవనం గడిపే డాక్టర్ ఉమామహేశ్వరరావు 2000 సంవత్సరంలో తెనాలిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మెడికల్ సూపర్వైజర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2016 వరకు దాదాపు 16 సంవత్సరాలు రూ.5 వేలు గౌరవ వేతనానికే ఆయన పనిచేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి జిల్లా స్థాయిలోనే గుర్తింపు పొందిన సెంటర్‌గా తెనాలి హెల్త్ సెంటర్‌ను రూపుదిద్దారు. జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి ఆయన దాదాపు 10 అవార్డులు అందుకున్నారు.
డాక్టర్ ఉమా మహేశ్వర రావు జాతీయ కొవిడ్ వారియర్ పురస్కారానికి ఎంపిక కావటం పట్ల ఆనందంగా ఉందని తెనాలి ఐఎంఏ అధ్యక్షులు సాంబిరెడ్డి అన్నారు. కేవలం గౌరవ వేతనంతోనే ఉమా మహేశ్వర రావు సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు.
ఇదీచదవండి
'సీఐడీ అదనపు డీజీ'పై నివేదిక ఇవ్వండి: రఘురామ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ