కేంద్ర ప్రభుత్వం నూతనంగా హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతులు ఇవ్వడాన్ని ఐఎంఏ వైద్యులు తప్పుపట్టారు. అనుభవం తక్కువగా ఉన్న హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశం ఇస్తే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం అవుతుందని వైద్యులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే అవకాశాన్ని తక్షణమే రద్దు చేయాలని నరసరావుపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రభుత్వ వైద్యులు నిరసన ద్వారా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... ఏపీ లైవ్ అప్డేట్స్: రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్