ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు - ఇసుక అక్రమ రవాణా వార్తలు

ఓ వైపు ఇసుక దొరక్క.. పనులు లేక కార్మికులు ప్రాణాలు కోల్పోతుంటే.. మరో వైపు కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఓగేరు వాగు పక్క భూముల్లో జరుగుతోన్న ఇసుక అక్రమ రవాణాపై ఈటీవీ భారత్​ కథనం..!

గుంటూరులో ఓగేరు వాగు వద్ద ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : Nov 5, 2019, 3:07 PM IST

Updated : Nov 5, 2019, 7:09 PM IST

గుంటూరులో ఓగేరు వాగు వద్ద ఇసుక అక్రమ రవాణా

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఓగేరు వాగు పక్కన భూముల్లో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వాగులు, వంకల్లో ఉండే ఇసుక, మట్టిని అక్రమంగా తరలించకూడదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వాటిని పక్కనపెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు. వాగు సమీపంలోని రాజాపేట, మద్దిరాల, గోపాలంవారిపాలెం గ్రామాల పరిధిలోని రైతుల వద్ద భూములను లీజుకు తీసుకున్న కొందరు వ్యక్తులు మూడు అడుగుల లోతున ఇసుక తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంతాల గ్రామస్థులు వాపోతున్నారు. వాగు పక్కన పెద్ద పెద్ద గుంతలు తీసి ఇసుక తీస్తుండటంతో వర్షాల సమయంలో పొరపాటున వాటిలో ఎవరైనా పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇసుకను లారీల్లో గుంటూరు ,విజయవాడకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇసుక కొరతతో మరో భవన కార్మికుడు ఆత్మహత్య

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఓగేరు వాగు పక్కన భూములలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది

Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఓగేరు వాగు పక్కన భూములలో యదేచ్చగా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు... రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వాగులు, వంకల లో ఇసుక, మట్టి అక్రమంగా తరలించ కూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ . వాటిని పక్కనపెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు ...వాగు సమీపంలోని రాజాపేట, మద్దిరాల, గోపాలంవారి పాలెం గ్రామాల పరిధిలో రైతుల వద్ద భూములను లీజుకు తీసుకొని అందులో మూడు అడుగుల లోతున తొలగించి ఆ తర్వాత వచ్చే ఇసుక ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.. మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇంత జరుగుతున్న కనీసం పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంతాల గ్రామస్థులు వాపోతున్నారు .. వాగు పక్కన పెద్ద పెద్ద గుంత లు తీసి ఇసుక తీస్తుండడంతో వర్షాల సమయంలో పొరపాటున వాటిలో ఎవరైనా పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి... తరలించిన ఇసుకను ఒకచోట కుప్పగా పోసి లారీలలో గుంటూరు ,విజయవాడ ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు వ్యాపారం చేస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
Last Updated : Nov 5, 2019, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.