ETV Bharat / state

కాసులు కురిపిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలు - bapatla illegal sand digging latest news

గుంటూరు జిల్లా బాపట్లలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. వ్యవసాయ భూముల్లో అక్రమ తవ్వకాలు చేపట్టినా అధికారులు స్పందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. . నిబంధనలు తుంగలోకి తొక్కి జేసీబీలతో తొమ్మిది అడుగుల లోతన ఇసుకను తవ్వేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

illegal sand digging
అక్రమ ఇసుక తవ్వకాలు
author img

By

Published : Sep 12, 2020, 1:29 PM IST

కాసులు కురిపిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలు

గుంటూరు జిల్లా బాపట్లలో అధికార పార్టీ నేతలకు ఇసక దందా కాసుల వర్షం కురిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ నుంచి అనుమతి లేకుండా.. నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంట భూముల మధ్య జేసీబీలతో తొమ్మిది అడుగుల లోతున ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వందల ట్రక్కుల ఇసుకను ప్రైవేటు లేఅవుట్లకు తరలిస్తూ.. జేబులు నింపుకుంటున్నారని మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాలపై స్థానిక అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనే అపవాదు ఉంది.

ప్రస్తుతం బాపట్ల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకోవటంతో.. నిర్మాణ రంగం ఊపందుకుంది. నిర్మాణాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇసుక ఏమాత్రం సరిపోవటం లేదు. దీంతో మార్కెట్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకొని అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్, ముగ్గురు నేతలు ఇసుక మాఫియా నడిపిస్తున్నారని స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. తీర గ్రామాల్లో ఇసుక భూముల్లో జోరుగా అక్రమ తవ్వకాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రైతుల భూముల్లో అనుమతులు లేకుండా నాలుగు ఎకరాల్లో జేసీబీలతో తొమ్మిది అడుగలకుపైగా ఇసుకను తవ్వేస్తున్నారని చెబుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను స్థిరాస్తి వ్యాపారులకు, ప్రైవేటు లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజల వాదన.

ఈ క్రమంలో నాలుగు జేసీబీలు, 25 ట్రాక్టర్లతో మరో ఐదు ఎకరాల్లో అక్రమంగా ఇసుక తవ్వి తరలించబోతుండగా.. ఈటీవీ-ఈటీవీ భారత్ బృందం అక్కడకి వెళ్లటంతో.. తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేశారు.

పంట భూముల మధ్య అక్రమ తవ్వకాలపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీర గ్రామాల్లో ఇసక తవ్వకాల వలన భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి: పర్యాటకానికి తీవ్రనష్టాలను మిగిల్చిన కరోనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.