ETV Bharat / state

బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదు: పవన్ కల్యాణ్ - YCP LATEST NEWS

JANASENA CHIEF PAWAN KALYAN COMMENTS: బీసీ కులాలన్నీ కలిస్తే.. రాజ్యాధికారం ఎవరికీ దక్కబోదని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ రౌండ్‌ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. మాట్లాడిన ఆయన.. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. తాను కాపు నాయకుడిని కాదని.. ఒక కులానికి పరిమితం కాదని పవన్‌ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. ప్రజలందరికీ నాయకుడిగా తాను ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశారు.

Janasena chief pawan kalyan
Janasena chief pawan kalyan
author img

By

Published : Mar 11, 2023, 10:28 PM IST

Updated : Mar 12, 2023, 6:09 AM IST

JANASENA CHIEF PAWAN KALYAN COMMENTS: మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ అరాచక పాలనపై యుద్ధం ప్రకటించేందుకు.. ‘నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అంటూ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి విచ్చేసి.. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. బీసీ కులాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..''నేను కాపు నాయకుడిని కాదు.. ఒక కులానికి మాత్రమే పరిమితం కాదు. నేను ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదు. బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలి. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే ఎప్పటికైనా దేహీ అనాల్సి వస్తోంది. బీసీ కులాలు 93 ఉంటే ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయి?. బీసీలకు అవకాశం ఇస్తేనే కదా.. నాయకత్వం ఎదిగేది. బీసీల ఓట్లే మీకు పడవు అని బీసీలే హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను బీసీ నాయకులతో పలు రకాలుగా తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే.. రెండు వర్గాలవారు గ్రామ స్థాయిలో ఘర్షణకు దిగుతారు. పన్నాగం పన్నిన నాయకులు ఏ పార్టీలో ఉన్నా విమర్శించుకోరు. పన్నాగం పన్నిన నాయకులు విమర్శించుకున్నా.. పద్ధతిగా ఉంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాలను జాబితా నుంచి తొలగించారు. జాబితా నుంచి తొలగించడంపై బీసీలు ఎందుకు ఉద్యమించట్లేదు?. బీసీ కులాలను జాబితా నుంచి తొలగించడంపై ఒక్క నాయకుడు స్పందించలేదు. కులాలను జాబితా నుంచి తొలగిస్తే ఏపీకి చెందిన ఒక్క బీసీ మంత్రి మాట్లాడరు. ఒక్క జనసేన మాత్రమే బలంగా మాట్లాడింది.'' అని ఆయన అన్నారు.

అనంతరం తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, ఆ 26 కులాలను భారాస బీసీ జాబితా నుంచి ఎందుకు తొలగించిందో, బీసీలకు ఎందుకు అన్యాయం చేసిందో భారాస ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బీసీలకు జనసేన అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బీసీలకు ఆర్థిక పరిపుష్టి కావాలని, కొందరే ఎదగవద్దని పవన్‌ సూచించారు. అట్టడుగు వర్గాలకు తనవంతు ఏం చేయగలనని ఎప్పుడూ ఆలోచిస్తుంటానని.. సంఖ్యా బలం లేని ఎంబీసీలకు ఏం చేయగలననే ఆలోచనలు ప్రతిరోజు మెదడులో తిరుగుతుంటాయని పేర్కొన్నారు.

బీసీలకు మైనింగ్‌లో ఆర్థికపరంగా వాటా ఉండాలని..ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉప ప్రణాళిక నిధులున్నాయని పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇకపై బీసీలకూ కూడా ఉప ప్రణాళిక నిధులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పవన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.34 వేల కోట్ల బీసీ నిధులు దారి మళ్లించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి మళ్లించకుండా అట్టడుగు వారికీ అందాలని.. 56 బీసీ కులాల కార్పొరేషన్లు రాజకీయ ఉపాధికే పరిమితం కావాలన్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా సాధికారత జరగలేదని.. బీసీలకు న్యాయం జరిగే అంశంపై ఒక రోజు రాష్ట్ర బంద్‌కు, రోజంతా ఆందోళన చేయడానికి తాను సిద్ధమంటూ పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదు

ఇవీ చదవండి

Last Updated : Mar 12, 2023, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.