ETV Bharat / state

IB Syllabus in AP Schools: ప్రభుత్వ బడుల్లో మరో కొత్త సిలబస్.. ఇంటర్ వరకు ఐబీ అమలు దిశగా అడుగులు - ఏపీ స్కూల్ కొత్త సిలబస్ 2023

IB Syllabus in APSchools: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అశాస్త్రీయ విధానాలతో పాఠశాల విద్య.. అస్తవ్యస్తంగా మారుతోంది. సీబీఎస్ఈ సిలబస్‌లోకి మార్చి రెండేళ్లైనా కాకుండానే ఇప్పుడు ప్రాథమిక విద్య స్థాయిలోనే అంతర్జాతీయ సిలబస్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాఠశాల్లలో ప్రమాణాలు విద్యార్థుల్లో పరిణతిని విస్మరించి పాఠ్య ప్రణాళికలతో ఆడుకుంటోంది.

IB_Syllabus_in_AP_Schools
IB_Syllabus_in_AP_Schools
author img

By

Published : Aug 15, 2023, 8:53 AM IST

Updated : Aug 15, 2023, 9:16 AM IST

IB Syllabus in AP Schools: ప్రభుత్వ బడుల్లో మరో కొత్త సిలబస్.. ఇంటర్ వరకు ఐబీ అమలు దిశగా అడుగులు

IB Syllabus in APSchools: రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో.. 24.3శాతం మంది 'క్యాట్, రెడ్, సన్, బస్' వంటి ఆంగ్ల పదాలను చదవలేకపోతున్నట్లు సర్వే బహిర్గతం చేసింది. పరిస్థితి ఇలా ఉంటే సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ అంటూ.. సీఎం జగన్ గొప్పలకు పోతున్నారు. సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలు దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఐబీ సిలబస్‌ను ఎల్​కేజీ, యూకేజీ నుంచే అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే, ఆచరణలో అనేక చిక్కులు ఎదురవుతాయని విద్యావర్గాలు చెబుతున్నాయి.

Tenali taluka School Closed Due to GO 117: పన్నెండు దశాబ్దాల చరిత్ర గల పాఠశాల.. ప్రభుత్వ చర్యలతో మూతపడే స్థాయికి..

విద్యార్థుల అభ్యసనం, మానసిక పరిణతి, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలుత రాష్ట్ర సిలబస్‌లోని పుస్తకాలను మార్చారు. 2022-23 నుంచి సీబీఎస్ఈ సిలబస్‌ను తెచ్చారు. దీన్ని ఈ ఏడాది తొమ్మిదో తరగతి వరకు పొడిగించారు. గతేడాది వెయ్యి పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు లభించింది. ఇది జరిగి రెండేళ్లైనా పూర్తి కాలేదు.. అంతలోనే, ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుపై ఈ నెల 17న ఒప్పందం చేసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు.

Education Syllabus Changes in AP: 'ఇదేంటి జగన్ మామా..?' పాఠశాల సిలబస్ మార్పుపై విద్యార్థుల్లో అయోమయం

పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఐదో తరగతి వరకు వచ్చే ఏడాది ఐబీ సిలబస్ తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదో తరగతి వరకు సీబీఎస్ఈ చదివిన వారు ఐబీలోకి మారాల్సి ఉంటుంది. తదనుగుణంగా పాఠ్యపుస్తకాలను కొత్తగా ముద్రించాలి. ఈ ఏడాది మిగిలిన కోట్ల పుస్తకాలు నిరుపయోగంగా మారతాయి. 4-9 తరగతుల విద్యార్థులకు ఇచ్చిన బైజూస్ కంటెంట్ కూడా మూలన పడనుంది.

ఐబీ సిలబస్​ను ఎల్​కేజీ, యూకేజీ నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్య లేదు. అంగన్వాడీల్లోనే బోధిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లను పదో తరగతి అర్హతతో నియమించారు. వీరు ఐబీ సిలబస్ ప్రమాణాలను అందుకొని, బోధించగలరా? బోధనతోపాటు ఇతర విధులను సమన్వయం చేసుకోగలరా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన

ఐఐటీ, నిట్, ట్రిపుల్‌ ఐటీ, వైద్య విద్య ప్రవేశ పరీక్షలకు ఎన్​సీఈఆర్​టీ సిలబస్సే ఆధారం. వీటికి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తున్నాయి. సర్కారీ బడుల్లో ఐబీ సిలబస్ తీసుకొస్తే వీరికి సీట్లు ఎలా వస్తాయన్నది ప్రశ్న. కేంద్రం నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చేందుకు 33 ఏళ్లకు పైగా పట్టింది. కానీ, ఏపీ ప్రభుత్వం రెండేళ్లకోసారి పాఠ్యప్రణాళిక మార్చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల విలీనం కారణంగా చాలా చోట్ల 1, 2 తరగతులే మిగిలాయి. పిల్లలు తక్కువగా ఉన్నారని, 9,602 బడులను ఏకోపాధ్యాయులతో కొనసాగిస్తున్నారు. రెండేసి తరగతులకు ఒక టీచర్ ఐబీ సిలబస్ ఎలా బోధిస్తారో ప్రభుత్వమే చెప్పాలి.

Last Updated : Aug 15, 2023, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.