ETV Bharat / state

కరోనా రెడ్​జోన్లలో డ్రోన్​తో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ - lockdown in mangalagiri

కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రెడ్​జోన్ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో అధికారులు హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

Hydrochloride solution spray with drone in red zone areas  in  mangalagiri
రెడ్​జోన్ ప్రాంతాల్లో డ్రోన్​తో హైపో క్లోరైడ్ ద్రావణ పిచికారి
author img

By

Published : Apr 11, 2020, 4:41 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లేందుకు అధికారులు అధునాతన సాంకేతిక పద్ధతిని పాటించారు. కేసులు నమోదైన వీధిలో అధికారులు డ్రోన్ సహాయంతో హైపో క్లోరైడ్ ద్రావణం చల్లించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ డ్రోన్లను రూపొందించారు. పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని, గుంటూరు అర్బన్ ఏఎస్పీ ఈశ్వర్​రావు ఈ పనులను పర్యవేక్షించారు.

ఇదీ చూడండి:

గుంటూరులో రెడ్ జోన్.. కఠినంగా ఆంక్షల​ అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.