ETV Bharat / state

మాదకద్రవ్యాల సరఫరా కేసు.. ఎడ్విన్‌ న్యూన్స్‌పై పోలీసులు పీడీయాక్ట్ - ఎడ్విన్‌ న్యూన్స్‌పై నగర పోలీసులు పీడీయాక్ట్

PD Act on Drug Supplier Edwin Nunes: గోవా కేంద్రంగా మాదకద్రవ్యాలు రవాణా చేసే ఎడ్విన్‌ న్యూన్స్‌ పై... హైదరాబాద్‌ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. మత్తు పదార్ధాల సరఫరాలో ఎడ్విన్‌పై ఓయూ, రాంగోపాల్‌పేట్‌, లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లలో మూడుకేసులు నమోదయ్యాయి. గోవాలో పాగా వేసిన అతడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. గోవాలో నమోదైన నాలుగు కేసుల్లో... ఒక కేసులో బెయిల్​పై విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లాడు. మూణ్నెళ్లు శ్రమించిన హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పోలీసులు గత నెలలో ఎడ్విన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఎడ్విన్‌ న్యూన్స్‌పై పోలీసులు పీడీయాక్ట్

author img

By

Published : Dec 12, 2022, 12:28 PM IST

PD Act on Drug Supplier Edwin Nunes: మత్తు పదార్ధాల సరఫరా... రవాణ వ్యవహారంలో కీలకంగా ఉంటున్న నేరగాడు ఎడ్విన్‌ న్యూన్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పోలీసులు గత నెలలో ఇతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌ పై విడుదలయి ఎడ్విన్‌ లాలాగూడ, ఓయూ, రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లలో హాజరవుతూ వచ్చాడు. ఇతనికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్‌ మాఫియాతో సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది.

నాలుగు నెలల క్రితం ఓయూ పోలీసులు మత్తుపదార్ధాలు విక్రయిస్తున్న ప్రితీష్‌ బోర్రర్‌, మంజూర్‌ అహ్మద్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి సేకరించిన వివరాలతో ఈ మొత్తం వ్యవహారంలో ఎడ్విన్‌తో పాటు వికాస్‌ నాయక్‌, గోవెకర్‌, సల్గాంకర్‌, రమేష్‌, కీలక సూత్రదారులుగా తేల్చారు. దేశ, విదేశాలకు చెందన మాదకద్రవ్యాల వ్యాపారులతో సంబంధాలు పెట్టున్న ఎడ్విన్‌ మత్తు మాఫియా సామ్రాజాన్ని విస్తరించి మామ సెబాస్టియన్‌ సహాయంతో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

ముందస్తు బెయిల్‌ కోసం ఎడ్విన్‌ ఏకంగా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఎడ్విన్‌ పై పీడీ చట్టం నమోదు చేసిన పోలీసులు ప్రీతీష్‌ బోర్కర్‌, వికాస్‌ నాయక్‌ తదితరులపై కూడా పీడీ చట్టం నమోదు చేసి కటకటాల్లోకి పంపనున్నట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.