గుంటూరు జిల్లా నందమూరి తారకరామారావు కాలనీకి చెందిన రమాదేవికి విజయరామిరెడ్డితో 24ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయరామిరెడ్డి గత రెండేళ్ల నుంచి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యా, పిల్లలను వేధించడం ప్రారంభించాడు. శనివారం రాత్రి భార్యాపిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులను బెదిరించాడు. బాధితులు స్థానిక పోలీస్స్టేష్లో ఫిర్యాదు చేస్తే... ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ... అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: అప్పు చెల్లిస్తానని నమ్మించాడు... అదును చూసి చంపేశాడు