ETV Bharat / state

స్వేచ్చాయుత ఎన్నికలకు... భారీ బందోబస్తు: డీఎస్పీ శ్రీనివాసరావు

బాపట్ల సబ్​డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసకుంటోందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే 570 మంది అనుమానితులను గుర్తించామని ఆయన వెల్లడించారు.

స్వేచ్చాయుత ఎన్నికలకు... భారీ బందోబస్తు: డీఎస్పీ శ్రీనివాసరావు
స్వేచ్చాయుత ఎన్నికలకు... భారీ బందోబస్తు: డీఎస్పీ శ్రీనివాసరావు
author img

By

Published : Feb 2, 2021, 10:43 AM IST

స్వేచ్చాయుత ఎన్నికలకు... భారీ బందోబస్తు: డీఎస్పీ శ్రీనివాసరావు

బాపట్ల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసుశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఈటీవీ భారత్ తో డీఎస్పీ ముఖముఖి మాట్లాడారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని సమర్థులైన అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలన్నారు.

సమస్యాత్మక గ్రామాలు, అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి... నిఘా పెట్టినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు. పది మండలాల పరిధిలోని 104 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన....1986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశామన్నారు. 80 అతి సమస్యాత్మక, 55 సమస్యాత్మక గ్రామాలు ఇప్పటికే గుర్తించామని చెప్పారు.

నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ పూర్తైన తర్వాత స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అవసరమైతే వీటి సంఖ్య పెంచుతామని స్పష్టం చేశారు. 570 మంది అనుమానితులను గుర్తించి 112 బైండోవర్ కేసులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని ఆయన కోరారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనల నిర్వహణ, మైక్ వినియోగానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'ఆడపిల్ల పుట్టకుండా రెండుసార్లు అబార్షన్ చేయించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.