ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తుందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు అరెస్టులు సహజమని అన్నారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.
గుంటూరు కలెక్టరేట్లో చేనేత నేతన్న హస్తం ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. కొవిడ్ సంక్షోభంలోనూ చేనేత నేతన్న నేస్తం పథకం ద్వారా మూడు విడతలుగా ఏడాదికి 24 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేసిందని హోం మంత్రి గుర్తు చేశారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పవర్ లూమ్ యంత్రాల వంటివి ఏర్పాటు చేయటం ద్వారా చేనేత రంగాన్ని ఆధునీకరించనున్నామని సుచరిత చెప్పారు. ఎమ్మెల్యేలు మద్దాలి గిరధర్, షేక్ ముస్తఫా, కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: