జమ్ము-కశ్మీర్ పునర్విభజన బిల్లు పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోనూ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర హోంశాఖ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల డీజీపీలతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. కీలకమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాల్సిందిగా హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయని డీజీపీ వెల్లడించారు. అదే సమయంలో కశ్మీరీ విద్యార్థులు చదువుతున్న విద్యాసంస్థల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచనలు వచ్చాయన్నారు. హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోని కీలకమైన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పెంచారు.
ఇదీ చదవండి : కశ్మీర్ డైరీ: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా