Sucheritha comments on Amaravathi issue: పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి ఉందని.. ఈ విషయం గతంలో చాలాసార్లు కేంద్రం స్పష్టం చేసిందని ఆమె గుర్తుచేశారు.
చట్టాలు చేసే అధికారం శాసనసభకు ఉందని చెప్పేది వాళ్లే.. లేదని చెప్పేది వాళ్లేనా..? అని ప్రశ్నించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటును సుచరిత ప్రారంభించారు.
ఇదీ చదవండి:
TDP Leaders Fires: రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే.. దేవుడు కూడా క్షమించడు: తెదేపా