గుంటూరులో నిన్న హత్యకు గురైన విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను జీజీహెచ్‌లో హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపును రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అందుకు సంబంధించిన చెక్కును రమ్య కుటుంబ సభ్యులకు హోం మంత్రి అందించారు.
''దిశ చట్టం ఏమి చేస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. గతంలో దర్యాప్తునకు 120 రోజులు పట్టేది.. దిశ వచ్చిన తర్వాత 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవుతుంది. విచారణ వేగవంతానికి రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబుల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే 60 మంది ఎఫ్ఎస్ఎల్ సిబ్బందిని నియమించాం. నిందితుడు తప్పించుకోవడానికి వీలు లేదని సీఎం చెప్పారు. పార్లమెంట్లో దిశ చట్టం ఆమోదం పొందాక ప్రత్యేక న్యాయస్థానాలు అందుబాటులోకి వస్తాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశాం. సురక్షితంగా లేని ప్రదేశాలకు వెళ్ళకూడదని ప్రజలు భావించాలి. వ్యక్తిగత భద్రత పాటించాలి. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు దిశ యాప్‌కు ఫిర్యాదు చేయాలి'' -హోంమంత్రి సుచరిత
ఇదీ చదవండి: