రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత ఉద్ఘాటించారు. గుంటూరు కృషి భవన్లో రూరల్ మండలం సమీక్షకు ఆమె హాజరయ్యారు. గ్రామీణ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, ఇళ్ల స్థలాలు, విద్యుత్తు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు పరిధిలోని 11గ్రామాల ప్రజాప్రతినిధుల నుంచీ వినతులు స్వీకరించామని... త్వరలోనే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి...