తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో చేసిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతిలో మహిళలు స్నానం చేస్తుంటే పోలీసులు డ్రోన్ల ద్వారా చిత్రీకరించారనడం అవాస్తవమని ఆమె వివరించారు. పోలీసులపై దుష్ప్రచారం చేయడం తగదని హోంమంత్రి సూచించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రైతు పక్షపాతన్న మంత్రి సుచరిత.... అమరావతి రైతులకు ప్రభుత్వం భూములు అభివృద్ధి చేసి ఇస్తుందని.. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
'డ్రోన్‌తో అభ్యంతరకర దృశ్యాలు చిత్రీకరించలేదు' - అమరావతిలో డ్రోన్ కలకలం వార్తలు
అమరావతిలో డ్రోన్ కలకలంపై హోం మంత్రి సుచరిత స్పందించారు. మహిళలు స్నానం చేస్తుంటే పోలీసులు డ్రోన్ల ద్వారా చిత్రీకరించారనడం అవాస్తవమని చెప్పారు. తెదేపా అక్రమాలు బయటకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

సంబంధిత కథనం