రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత.. అధికారులను ఆదేశించారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా గుంటూరు కలెక్టరేట్‌లో గ్రామీణ రోడ్లపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
జిల్లాలో 7 వేల కిలో మీటర్లకు పైగా రోడ్లుంటే అందులో 4 వేల కిలో మీటర్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా నిర్మించినట్లు తెలిపారు. రోడ్లు వేశాక వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కనెక్టివిటీ లేకుండా ఉన్న వాటిని గుర్తించాలని చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హోమంత్రి సూచించారు. గుంటూరు జిల్లా కాకుమానులో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న ఆంశమన్నారు. విద్యార్థులు వైరస్ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాడు నేడు పనులు ఏడాదిగా నిలిచిపోవటంపై ఆమె స్పందించారు. గుత్తేదారు నాసిరకం పనులు చేస్తున్నందున పనులు నిలిపేశామని..వెంటనే పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: