ETV Bharat / state

Home Minister: 'ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు డబ్బులెవరిస్తారు..?'.. హోమంత్రి ఆగ్రహం - అధికారులపై హోమంత్రి ఆగ్రహం న్యూస్

Sucharitha Fire On Agriculture Officers: వ్యవసాయశాఖ అధికారులపై హోమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె.. మిర్చికి ఈ-క్రాప్ చేయకపోవటంపై మండిపడ్డారు. ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు ఎవరు డబ్బులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు.

అధికారులపై హోమంత్రి ఆగ్రహం
అధికారులపై హోమంత్రి ఆగ్రహం
author img

By

Published : Dec 10, 2021, 4:23 PM IST

Home Minister Sucharitha Fire On Agriculture Officers: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల సర్వసభ్య సమావేశంలో హోమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ప్రత్తిపాడులో మిర్చికి ఈ-క్రాప్ చేయించలేదని ఈ సందర్భంగా రైతులు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన హోమంత్రి.. ఈ-క్రాప్ ఎందుకు చేయలేదని ఉద్యాన అధికారులను వివరణ అడిగారు.

ఈ-క్రాప్ వివరాల డేటా తయారు చేశారా? అని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో అధికారులపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు ఎవరు డబ్బులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు.

ప్రత్తిపాడులో తాగునీరు కూడా సరిగా రావటం లేదని.., ఈ విషయమై తాగునీటి సరఫరా అధికారిని అడిగిన పట్టించుకోవట్లేదని స్థానికులు హోంమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈని ప్రశ్నించిన హోంమంత్రి.. సరిగా పనిచేయకపోతే సస్పెండ్ చేసి వేరే అధికారితో పనిచేయిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

'పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టాం.. ఎమ్మెల్సీ హామీ అంటూ మర్రిని మోసం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.