గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో విలేకర్లకు హోంమంత్రి సుచరిత నిత్యావసర సరకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సరకులు ఉన్న వాహనాన్ని గుంటూరులో ప్రారంభించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు కచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీవీలు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారని కొనియాడారు. వారిని ప్రోత్సహించేందుకు తనవంతు బాధ్యతగా నిత్యావసరాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి.. 'సీఎం గారూ.. కరోనా కట్టడి కోసం చిత్తశుద్ధితో పని చేయండి'