వైద్యం కోసం ప్రజలు ఎక్కడికో వెళ్లకుండా వారున్నచోటే సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా గోరింట్లలో ఆర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు.
మండలానికి రెండు పీహెచ్‌సీలు, నియోజకవర్గ స్థాయిలో సామాజిక ఆస్పత్రులు, పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కరోనా వ్యాప్తిని ప్రభుత్వం సమర్థవంతంగా నియంత్రించిందని.. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అనారోగ్య సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ కావటి నాగమనోహర్ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
pulichinthala project: ప్రభుత్వ విప్‌ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు