ETV Bharat / state

తాడికొండలో సెమీ క్రిస్మస్​ వేడుకలు

గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్​ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ప్రతీ ఒక్కరూ... శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు.

semi cristamas
తాడికొండలో క్రిస్మస్​ వేడుకలు... హాజరైన హోం మంత్రి సుచరిత
author img

By

Published : Dec 24, 2020, 12:12 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో తాడికొండ గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరై భారీ కేక్​ కోశారు. ప్రతీ ఒక్కరూ... జాలి, దయ, కరుణ కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 25వ తేదీ నాడు క్రిస్మస్​తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసివస్తున్న రోజున సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్ తాడికొండ, మెడికొండూరు, తుళ్లూరు, ఫిరంగిపురం మండల అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

అమరావతి దీక్షా శిబిరాలలో సెమీ క్రిస్మస్​ వేడుకలు

అమరావతి దీక్షా శిబిరాలలో బుధవారం సెమిక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఉద్ధండరాయునిపాలెం, తుళ్లూరు దీక్షా శిబిరాలలో రైతులు, మహిళలు సెమి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఉద్ధండరాయునిపాలెంలో మొదట పోలీసులు ఆటంకం సృష్టించినా తర్వాత అనుమతించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనస్సు మారాలని ప్రార్థనలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

'పల్నాడును జిల్లాగా ప్రకటించే వరకు పోరాడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.