గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై నమోదైన సీబీఐ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు డీఓపీటీ శాఖమంత్రి జితేంద్రసింగ్ ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2017-2021 మధ్య కాలంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 సీబీఐ కేసులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక్కో రాష్ట్రంలో ఆరు కేసులతో ఉత్తరప్రదేశ్, కేరళ నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 5 కేసులు చొప్పున నమోదు కాగా, తమిళనాడులో నాలుగు కేసులు కొత్తగా వచ్చినట్టు పేర్కొన్నారు.
2017 నుంచి 2022 అక్టోబరు నాటికి దేశ వ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదైనట్టు మంత్రి వెల్లడించారు. వాటిలో 22 కేసుల్లో ఛార్జిషీట్‌లు దాఖలు చేసినట్టు తెలిపారు. సీబీఐ కేసులలో 2017లో 66.90శాతం శిక్ష రేటు నమోదు కాగా.... 2018లో 68శాతం, 2019లో 69.19 శాతం, 2020లో 69.83శాతం, 2021లో 67.56శాతంగా ఉన్నట్టు డీఓపీటీ వెల్లడించింది.