విజయవాడ, తిరుపతిలో భూసేకరణ, పునరావాస అథారిటీలకు.. నాలుగు వారాల్లో ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పీవోల కేటాయింపులో జాప్యాన్ని సవాలు చేస్తూ.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పొన్నకంటి మల్లికార్జునరావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ధర్మాసనం విచారణ చేసింది.
విశాఖకు ఇప్పటికే పీవోను కేటాయించినట్లు న్యాయస్థానానికి ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
వాలంటీర్లు సెల్ఫోన్లు మున్సిపల్ అధికారులకు అప్పగించాలి: హైకోర్టు