గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్ చేశారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. పిటిషనర్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని గనుల శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. తాము చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది నాగరఘు వాదనలు వినిపించారు.
పిటిషనర్లలో కొందరు నిందితులుగా ఉన్నారని.. వారు పిల్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్ వేయకముందు ఆరోపణలు చేస్తే కేసు పెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అన్ని ఆధారాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: తొలి విడత ఎన్నికల పూర్తి సమాచారం.. చదవండి!