High Court Hearing on Habeas Corpus Petition: అక్రమాలపై ఎదురు తిరిగితే పోలీసులతో కేసులు పెట్టించడం వైసీపీ ప్రభుత్వంలో పరిపాటిగా మారిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలపై గళం విప్పితే... శ్రీకృష్ణుడి జన్మ స్థానానికి పంపిస్తున్న పరిస్థితులు రోజూ చూస్తునే ఉన్నాం. చంద్రబాబు అరెస్ట్‌కు మద్దతుగా మాట్లాడినా... ఆయన కోసం నిరసనలు చేసినా కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ తెలుగుదేశం నేత కొల్లు రవీంద్ర చేపట్టిన సైకిల్ ర్యాలీకి అనుమతి లేదంటూ ఆయనను అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆయన ఆచూకీ కోసం వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
151 నోటీసులు పెద్ద నేరానికి పాల్పడితేనే ఇస్తారు కదా... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పోలీసులు రవీంద్రను అక్రమంగా నిర్బంధించారని కోర్టుకు తెలిపారు. కొల్లు రవీంద్ర పై కేసు నమోదు చేసినట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. 151 CRPC సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తే రవీంద్ర నిరాకరించారని కోర్టుకు వివరించారు. 151 నోటీసు పెద్ద నేరానికి పాల్పడితేనే ఇస్తారు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ దసరా సెలవుల అనంతరం చేపట్టనున్నట్లు వెల్లడించింది.
-
పిచ్చోడి చేతిలో రాష్ట్రం#PichiJagan https://t.co/TInIeh0Oig
— Lokesh Nara (@naralokesh) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">పిచ్చోడి చేతిలో రాష్ట్రం#PichiJagan https://t.co/TInIeh0Oig
— Lokesh Nara (@naralokesh) October 18, 2023పిచ్చోడి చేతిలో రాష్ట్రం#PichiJagan https://t.co/TInIeh0Oig
— Lokesh Nara (@naralokesh) October 18, 2023
ట్వీట్టర్ లో స్పందించిన లోకేశ్... రాష్ట్రం పిచ్చోడి చేతిలో ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తల్లి వర్ధంతి కార్యక్రమానికి కూడా వెళ్లకుండా కొల్లురవీంద్ర ను పోలీసులు అడ్డుకోవడం పై లోకేశ్ మండిపడ్డారు. పిచ్చి జగన్ అంటూ భువనేశ్వరి ట్వీట్ కు లోకేశ్ రీట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం మాజీమంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో... సైకిల్ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు కొల్లు రవీంద్ర అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయను నాగాయలంక స్టేషన్‌కు తరలించారు. కొల్లు రవీంద్రకు మద్దతుగా వెళ్లిన మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు మండలి వెంకట్రామ్ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. కొల్లు అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసు స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చి తిరిగి బందరు తీసుకెళ్లి వదిలేస్తామని పోలీసులు తెలిపారు. కానీ, అలా చేయకుండా అర్ధరాత్రి వరకూ నిడమోలు, కూచిపూడి, నాగాయలంక ప్రాంతాల్లో తిప్పారు. కొల్లు రవీంద్ర అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు హౌజ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమయ్యారు. నాగాయలంక స్టేషన్ నుంచి కొల్లును తీసుకువెళ్లిన పోలీసులు.. వెనుక వస్తున్న అనుచరుల వాహనాలను దారి మళ్లించి ఆయన్ను అజ్ఞాతంలోకి తీసుకు వెళ్లారు. తన తండ్రి ఆచూకీ తెలపాలంటూ కొల్లు రవీంద్ర తనయుడు.. పునీత్ చంద్ర జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.