ETV Bharat / state

'ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు' చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

High Court Hearing Chandrababu Inner Ring Road Case: అమరామతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అలాగే అమరావతి పరిధిలో అసైన్డ్‌ ల్యాండ్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబర్‌ 11కు వాయిదా వేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది

High_Court_Hearing_Chandrababu_Inner_Ring_Road_Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 4:25 PM IST

High Court Hearing Chandrababu Inner Ring Road Case : అమరామతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు నాయుడుపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే పిటిషనర్‌ తరుపు సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై విచారణ వాయిదా : అమరావతి పరిధిలో అసైన్డ్‌ ల్యాండ్‌ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 11కు వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌ న్యాయస్థానం మంజూరు చేసింది. రాజధాని పరిధిలో అసైన్డ్‌ ల్యాండ్‌ కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడి కేసు నమోదు చేసింది.

చంద్రబాబుపై అప్పుడే చర్యలు వద్దు - ఏం చేయాలో మేము చెప్తాం: ఏపీ హైకోర్టు

నారాయణ అల్లుడు వరుణ్ పిటిషన్ విచారణ వాయిదా ​: మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్​కు సీఐడీ లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. లుకౌట్‌ సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు వరుణ్​. పిటిషన్ మీద కూడా హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి సీఐడీ న్యాయస్థానాన్ని సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో వరుణ్ నిందితుడిగా ఉన్నారు.

మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్లపై హైకోర్టులో విచారణ !

AP High Court Hearing Former MP Undavalli Arun Kumar Petition to Hand Over Skill Development Case to CBI : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. కొంతమందికి మాత్రమే నోటీసులు అందాయని మరి కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకు వచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని మిగతా వారి అడ్రస్​లు తప్పుగా ఉండటంతో అవి చేరలేదని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు. వీరికి పర్సనల్ నోటీసులు ఇవ్వటానికి పిటిషనర్ అనుమతి కోరారు. కొత్త అడ్రసులతో మళ్లీ ఫ్రెష్ నోటీసులు ఇవ్వటానికి కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 30కి వాయిదా వేసింది.

టీడీపీ నేతలపై సీఐడీ కేసులు - ముందస్తు బెయిల్​ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.