High Court on Anganwadi Posts : అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు పచ్చజెండా ఊపింది. నిబందనల ప్రకారం పోస్టులు భర్తీ చేయడం లేదంటూ.. పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపింది. అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టులకు ఈ యేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం నోటిషికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ద్వారా 600 పైచిలుకు పోస్టులు భర్తీ చేయనున్నారు.
అభ్యర్ధులకు రాత పరీక్షలో 45 మార్కులు, వైవాలో 5 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష నిర్వహించిన అధికారులు కొందరికే వైవా నిర్వహిస్తున్నారంటూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు నిబంధనల ప్రకారమే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశారని మెరిట్ విద్యార్ధుల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
మెరిట్ విద్యార్ధులకు మాత్రమే వైవా నిర్వహిస్తారని నోటిఫికేషన్లో ఉందని వాదనలు వినిపించారు. భర్తీ ప్రక్రియ కొనసాగించే విధంగా ఆదేశాలివ్వాలని కోరారు. అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై గతంలో హైకోర్టు స్టే విధించింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయాలంటూ గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ కోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి: