High Court on appointment of advisers: సలహాదారుల నియామకాలపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర కార్యనిర్వహణవర్గంలో ఉన్నతస్థాయి వ్యక్తులు సలహాదారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారన్న ఏజీ వాదనపై తీవ్రంగా స్పందించింది. ఉన్నతస్థాయి వ్యక్తులు సైతం ప్రభుత్వంలో భాగమే కాని.. వారే ప్రభుత్వం కాదని తేల్చిచెప్పింది. వారు చట్టబద్ధపాలనను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
రాత్రికిరాత్రి సలహాదారులుగా: సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర కార్యనిర్వహణవర్గంలో ఉన్నతస్థాయి వ్యక్తులు సలహాదారుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారన్న ఏజీ వాదనపై తీవ్రంగా స్పందించింది. ఉన్నతస్థాయి వ్యక్తులు సైతం ప్రభుత్వంలో భాగమేకాని.. వారే ప్రభుత్వం కాదని తేల్చిచెప్పింది. వారు చట్టబద్ధపాలనను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. పరిపాలన వ్యవహారం బాధ్యతాయుతమైందని, ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రోడ్డుమీదున్న వ్యక్తులను రాత్రికిరాత్రి సలహాదారులుగా నియమించుకోవడానికి వీల్లేదంది. బయట నుంచి ప్రభుత్వంలోకి సలహాదారులుగా వచ్చిన వ్యక్తులకు జవాబుదారీతనం ఏముంటుందని వ్యాఖ్యానించింది. వారి నియామకానికి నిబంధనలను, ప్రవర్తన నియమావళి ఎక్కడున్నాయని ప్రశ్నించింది.
జవాబుదారీతనంపై ప్రశ్న: సలహాదారులు మంత్రులను సమావేశాల్లో పాల్గొంటారని.. సున్నితమైన అంతర్గత సమాచారం వారి ద్వారా బయటకు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రభుత్వ టెండర్ల నిర్ణయం తదితర విషయాలు వారికే ముందుగా తెలిసే అవకాశం ఉందంది. సలహాదారులు చెప్పిన వివరాలకు రాతపూర్వకంగా రికార్డుల్లో నమోదు కావని.. అప్పుడు వారికి జవాబుదారీతనం లేకుండా పోతుందని తెలిపింది. రాష్ట్రప్రభుత్వం నియమించిన సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను తేలుస్తామని పునరుద్ఘాటించింది. సలహాదారులను నియమించుకుంటూ పోతే ఆ సంఖ్యకు అంతెక్కడ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో కలెక్టర్లకు, ఎస్పీలకు సలహాదారులను నియమిస్తారని, దీంతో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అవుతుందని పునరుద్ఘాటించింది. వాదనల కొనసాగింపునకు విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
ఎన్.చంద్రశేఖర్రెడ్డి నియామకంపై: జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయ శాఖకు సలహాదారునిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి రాజశేఖరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్.చంద్రశేఖర్రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ విశ్రాంత ఉద్యోగి ఎస్ మునెయ్య హైకోర్టులో మరో పిల్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి. సలహాదారుల నియామక వివరాలను ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని పిటిషనర్ రాజశేఖరరావు తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సలహాదారుల జీతభత్యాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా ఖర్చుచేస్తున్నారు. నచ్చిన వారిని సలహాదారులుగా నియమించారు. సలహాదారుల నియామకానికి ఎలాంటి నిబంధనను అనుసరించారు, వారి అర్హతలేమిటో పేర్కొనలేదన్నారు.
ఇవీ చదవండి: