High Court comments on Social Security Pension: సామాజిక భద్రత పింఛన్‌కు అర్హులైనవారు (వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, తదితరులు) ఒకే ఇంట్లో ఇద్దరు నివసిస్తుంటే.. అందులో ఒక్కరికే పింఛన్ ఇస్తామంటూ రాష్ట్ర ప్రభ్వుత్వం 2019 డిసెంబర్లో తెచ్చిన జీవో 174లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఇది ఆర్థికాంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమని పేర్కొంది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ఈ విషయంపై నిర్ణయాన్ని ప్రభుత్వ విచక్షణకే విడిచిపెడుతున్నట్లు పేర్కొంది.
వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ - పలు షరతులు విధించిన సీబీఐ కోర్టు
ఒకరికే పెన్షన్ సవాలు కోర్టుకు: చేస్తూ ఒకే ఇంట్లో పెన్షన్‌కు అర్హత ఉన్నవాళ్లు ఇద్దురు నివశిస్తున్నప్పటికీ జీవో 174 ప్రకారం ఒకరికే పెన్షన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ Justice Dheeraj Singh Thakur), జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చింది. ఒకే ఇంట్లో అర్హులైన వృద్ధాప్య, వితంతు, ఒంటిరి మహిళలు ‘ఇద్దరు’ నివశిస్తున్నప్పటికీ జీవో 174లోని నిబంధన 4(1) ప్రకారం ఒకరికే పెన్షన్ ఇవ్వడానికి వీలుకల్పించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ (PIL in High Court) వేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న వృద్ధులు, వితంతువుల్లో ఒకరికే పింఛను ఇస్తున్నారన్నారు. ఇలాంటి నిర్ణయం రాజ్యాంగం, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం మార్గదర్శకాలకు విరుద్ధం అన్నారు. పెన్షన్ చెల్లింపుల్లో కేంద్రప్రభుత్వం సైతం సహకారం అందిస్తోందన్నారు. కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ (Pension) ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు - సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌తో ముఖాముఖి
ఏటా రూ. 19,161 కోట్లు ఖర్చు: ఈ ఆరోపణలపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కుటుంబంలో వితంతు, వృద్ధాప్య పెన్షన్లతో పాటు 80శాతం, ఆపైగా అంగవైకల్య ఉన్నా, డయాలసిస్ రోగి (Dialysis patient), హెచ్‌ఐవీ (HIV) భారినపడిన వారున్నా పెన్షన్ ఇస్తున్నారన్నారు. అరుదైన సందర్భాలలో తప్ప.. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. పెన్షన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్న వాటా/భాగం గణాంకాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచామన్నారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. వివిధ వర్గాల ప్రజలకు పెన్షన్ చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 19,161 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (National Social Assistance Programme) మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించడం లేదన్న పిటిషనర్ వాదనతో అంగీకరించలేమని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది.
భార్యాపిల్లలు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోరా - పోలీసులపై హైకోర్టు ఆగ్రహం