ETV Bharat / state

విమర్శిస్తూ పోస్టులు పెట్టడం.. విద్వేషం రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుంది: హైకోర్టు - Palakollu Latest News 3

High Court on Socialmedia Posts: సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తూ పోస్టులు పెట్టడం రెండు సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుందని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారన్న కారణంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీసులు గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన సీహెచ్‌ గోపికృష్ణపై 2020మేలో నమోదు చేసిన కేసును కొట్టేసింది.

How can criticizing posts be inciting hatred
విమర్శిస్తూ పోస్టులు పెట్టడం విద్వేషం రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుంది: హైకోర్టు
author img

By

Published : Dec 18, 2022, 10:17 AM IST

High Court on Socialmedia Posts: గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన సీహెచ్‌ గోపికృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాల పనితీరుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన పసుపులేటి వీరాస్వామి 2020 మే 5న గోపికృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153c, 500, 500ఏ, 505(1)బి, ఐటీ చట్టం సెక్షన్‌ 67 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుపై ప్రస్తుతం పాలకొల్లు కోర్టులో విచారణ జరుగుతోంది.

తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని గోపికృష్ణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయవాది జాగర్లమూడి కోటేశ్వరీదేవి వాదనలు వినిపించారు. తెదేపా సానుభూతిపరులను వేధించడం కోసం తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా పోలీసులు పిటిషనర్‌పై కేసు పెట్టారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ చేయడానికి వీల్లేకుండా గొంతు నొక్కుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని పొగుడుతూ పిటిషనర్‌ పోస్టులు పెట్టారే తప్ప.. రెండు గ్రూపుల మధ్య విద్వేషాలు పెంచే ప్రస్తావనే లేదన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవన్నారు.

ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్‌పై నమోదు చేసిన కేసును కొట్టేశారు. ఫేస్‌బుక్‌లో పోస్టులను పరిశీలిస్తే.. మతం, తెగలు, కులాలు, సమూహాల మధ్య శతృత్వం పెంచే వ్యవహారం లేదన్నారు. ఇదే తరహా సెక్షన్లతో సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసును న్యాయస్థానం ఇటీవల కొట్టివేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.