హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ పునఃప్రారంభించాలని కోరుతూ.. జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. తన వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మరో అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు.. కరోనా కట్టడికి.. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది.
ఇదీ చదవండి: రష్యా 'కరోనా వ్యాక్సిన్' విడుదల