ETV Bharat / state

గుంటూరుకు వేలాది పోలీసులను రప్పించిన ఉన్నతాధికారులు - ఎందుకు పిలిచారో అర్ధంకాక సిబ్బంది అవస్థలు - ఏపీ లేటెస్ట్ న్యూస్

Heavy Police Forces in Guntur Parade Ground: ఏపీలోని పలు పోలీసు బెటానియన్ల నుంచి వేలాదిమందిని గుంటూరు పరేడ్ గ్రౌండ్​కు తరలించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి తమను ఎందుకు రప్పించారో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వలేదని.. చాలా మంది సిబ్బంది అంటున్నారు.

Heavy_Police_Forces_in_Guntur_Parade_Ground

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 8:24 AM IST

Updated : Nov 30, 2023, 8:39 AM IST

Heavy Police Forces at Guntur Parade Ground: గుంటూరు పరేడ్ మైదానంలో.. భారీగా పోలీసు బలగాలు మోహరించటం చర్చనీయాంశమైంది. మంగళగిరితోపాటు.. కర్నూలు, కాకినాడ, నెల్లూరు ఏపీఎస్పీ బెటాలియన్ల నుంచి వేలది మందిని గుంటూరుకు.. తరలించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది.?

గుంటూరు పోలీసు పరేడ్‌ మైదానం ఖాకీవనాన్ని.. తలపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ.. రాష్ట్రంలోని పలు పోలీసు బెటాలియన్ల నుంచి పోలీసులు వస్తూనే ఉన్నారు. కర్నూలు, నెల్లూరు, కాకినాడ, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లలోని పోలీసులతోపాటు.. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో శాంతిభద్రతల విభాగంలో పనిచేసే పోలీసులనూ రప్పించారు. ఆయా పోలీసు స్టేషన్లలో ఎస్సై, ఏఎస్సైలలో ఒకరిని, నలుగురు సిబ్బందిని ఉంచి.. మిగితా సిబ్బంది మొత్తాన్నీ గుంటూరుకు రప్పించారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత- ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వాగ్వాదం

గుంటూరు వచ్చిన వారికి రాత్రి వరకూ విధి నిర్వహణ ఎక్కడో చెప్పలేదు. ఇంత అస్పష్టత గతంలో ఎప్పుడూ లేదని.. పోలీసులు చర్చించుకున్నారు. విధి నిర్వహణకు పిలిచేటప్పుడు.. పలానా విధులు అని, పలానా అధికారి వద్ద నిర్దేశిత సమయానికి రిపోర్టు చేయాలని పేపర్‌ ఇచ్చేవారు. ఇప్పుడలాంటిదేమీ లేకపోవటం.. పలు అనుమానాలకు తావిచ్చింది. పోలీసుల రాకపై అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి.

ఏదో పెద్ద ఆపరేషన్‌లో పాల్గొనేందుకు వచ్చారని, ప్రముఖుల్ని అరెస్టు చేయబోతున్నారని.. ప్రచారం జరిగింది. ఐతే.. పోలీసులు వీటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ పోలింగ్‌ దృష్ట్యా.. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే తరలివెళ్లేందుకు వీలుగా బలగాలను రప్పించినట్లు.. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు.. ఈటీవీకి ఫోన్‌లో చెప్పారు. పొరుగురాష్ట్రాల్లో ఏవైనా ఘర్షణలు జరిగితే.. బలగాలు వెళ్లటం మామూలేనని వివరణ ఇచ్చారు.

గుంటూరులో భారీగా పోలీసు బలగాలు మోహరింపు - భారీగా సిద్ధం కావటంతో వ్యక్తమవుతున్న అనుమానాలు

రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద.. 9 చెక్‌ పోస్టులు పెట్టామని, అక్కడ కొందరిని బందోబస్తుకు ఉంచుతామన్నారు. ఐతే.. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి 2వేల మంది వరకూ.. తెలంగాణా ఎన్నికల కోసం తరలివెళ్లారు. ఇప్పుడు మళ్లీ వందల మంది.. సిద్ధం కావటం సందేహాలు లేవనెత్తింది. పోలీస్‌ బాస్‌ల వ్యూహమేంటో తెలియకపోయినా.. పరేడ్‌ గ్రౌండ్‌కు వచ్చిన పోలీసులు.. గంటల తరబడి పడిగాపులు కాశారు.

ఉదయం నుంచి రాత్రి వరకూ నిలబడి నీరసించారు. మినరల్‌ వాటర్‌ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం.. తిండి తిప్పలకు బయటకే వెళ్లాలని సిబ్బందికి.. సూచించారు. ఆకలితో అల్లాడిన బలగాలు ఆ ప్రాంతంలో ఎక్కడ హోటళ్లు ఉంటే అక్కడకెళ్లి పొట్టనింపుకున్నారు. ఇంతటి అవస్థలు గతంలో ఎప్పుడూ పడలేదని.. సుదూర ప్రాంతాల నుంచి తమను ఎందుకు రప్పించారో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వలేదని.. చాలా మంది సిబ్బంది అంటున్నారు.

ఆస్తి పంపకాల వివాదం - పోలీసులు మందలించడంతో మహిళ ఆత్మహత్యాయత్నం

గుంటూరుకు వేలాది పోలీసులను రప్పించిన ఉన్నతాధికారులు - ఎందుకు పిలిచారో అర్ధంకాక సిబ్బంది అవస్థలు

Last Updated : Nov 30, 2023, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.