రాష్టంలో రాజన్న పాలనేమో కానీ.. రాక్షస పాలన నడుస్తోందని తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. వరద ముంపుపై సీడబ్యూసీ ముందుగానే హెచ్చరిక చేసినా ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆరోపించారు. ఈ వైఫల్యంపై.. జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. అమరావతి విషయమై ముఖ్యమంత్రి తక్షణమే స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి