గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా జీవీ ఆంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, శ్రావణ్ కుమార్, యరపతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.
అనంతరం నేతలు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్కు పాలన చేతకావడం లేదన్నారు. మద్యం, ఇసుక ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు తీసుకురావడంలో సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి విధ్వంసాలు, దౌర్జన్యాలు తప్ప.. రాష్ట్రాభివృద్ధి కోసం చేసిందేమీ లేదని తెదేపా నేతలు విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అమరావతిని నిర్వీర్యం చేశారని.. స్వప్రయోజనాల కోసమే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి..