గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థి సంఘాలపై వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి బెదిరింపులకు దిగారు. కాసు బ్రహ్మానందరెడ్డి కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు. దీనిపై ఆగ్రహించిన కాసు మహేశ్‌రెడ్డి.. తన అనుమతి తీసుకుని కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించాలని హెచ్చరించారు. 'ఇదే చివరి హెచ్చరిక. నువ్వు నా కాలేజీలోకి వస్తే ఊరుకోను. నువ్వు యూనియన్ అయితే నేను ఎమ్మెల్యే. నువ్వు 10 మందిని తెస్తే... నేను1000 మందిని తెస్తా. తన్ని పంపిస్తాను ఈసారి. పిచ్చి వేషాలు వేయమాకు' అంటూ బెదిరించారు.
క్షమాపణ చెప్పాలి
శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.