గుంటూరు జిల్లాలో వివాహేతర సంబంధంతో.. ఒక వ్యక్తిని చంపిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన బండి చెన్నయ్య ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సదరు మహిళతో పట్టాభి అమరలింగయ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం చెన్నయ్యకు తెలిసింది.
అమరలింగయ్యను పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు అతను మందలించినా ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తోట వెంకటేశ్వర్లు, గంధం రాంబాబుతో ఒక మహిళ సహకారం తీసుకొని అమరలింగయ్యను చంపేలా పథకం రచించారు. మహిళ ద్వారా అమరలింగయ్యను పిలిపించి వెల్దుర్తి మండలం దావుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బండరాయితో ముఖంపై కొట్టి.. కత్తితో గొంతుకోసి చంపారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి: