ETV Bharat / state

గుంటూరు జిల్లాలో రక్తమోడిన రహదారులు.. 12 మంది మృతి - గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం న్యూస్

gunturu accidents
gunturu accidents
author img

By

Published : Mar 1, 2020, 7:36 PM IST

Updated : Mar 2, 2020, 3:01 PM IST

19:34 March 01

గుంటూరు రోడ్లు రక్తంతో తడిచాయి. గంటల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో చీకటి నింపాయి. ఓ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా... మరోచోట నలుగురు ప్రాణాలు విడిచారు. రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో మరో ఇద్దరు మృతి చెందారు. 12 మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి.

కొంతమందేమో బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లివస్తున్నారు. మరికొంతమంది తాము పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్తున్నారు. అవే వారికి ఆఖరి ప్రయాణాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలు జరిగింది వేర్వేరు ప్రదేశాల్లోనే అయినా... వారందరి కుటుంబసభ్యుల రోదన ఒకటే. శుభకార్యాలప్పుడు మాత్రమే ఆనందంగా ఉండే పేదింటి బిడ్డలు కొందరైతే... చెమట చిందించి దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు మరికొందరు. అతివేగమో.. మరేదో కారణం... వారి ప్రాణాలు గాలిలో కలిపేసింది. గుంటూరు జిల్లాలోని రోడ్లను రక్తంతో తడిపేసింది.

గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన వారు ఓ శుభకార్యానికి వెళ్లారు. సంతోషంగా గడిపి ఇంటికి తిరిగి వస్తున్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం వాగులోకి దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. ఈలోపే ఆరుగురు మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతిచెందిన వారి కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. హోంమంత్రి సుచరిత, కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

పుల్లడిగుంట ఘటన జరిగిన కాసేపటికే మరో రోడ్డు ప్రమాదం అందరిని కలచివేసింది. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా వద్ద మిర్చి లారీ బోల్తా పడింది. కష్టపడి పండించిన  పంటను తీసుకెళ్తున్న రైతులు ఈ ఘటనలో మృతిచెందారు. నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలొదిలినట్టు తెలుస్తోంది. వీరిని బోధిలవీడుకు చెందిన రైతులుగా గుర్తించారు. లారీ క్వారీ గుంతలో పడి ప్రమాదం ఈ జరిగింది. వీటితో పాటు ఆదివారం రాత్రి గుంటూరు శివారు కేవీపీ కాలనీ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

ఇదీ చదవండి: మృతుల కుటుంబాలను ఆదుకుంటాం...2 లక్షల పరిహారం: హోంమంత్రి

Last Updated : Mar 2, 2020, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.