ETV Bharat / state

పోలీస్ స్టేషన్​లో సివిల్ కేసులు నిర్వహించరాదు: ఎస్పీ అమ్మిరెడ్డి - గుంటూరు జిల్లా వార్తలు

పోలీస్​స్టేషన్​కు వచ్చే బాధితుల పట్ల ఫ్రెండ్లి పోలీసింగ్ అమలు చేయడంతో పాటు... స్పందనకు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

Guntur Urban SP Ammireddy said cases related to land disputes in police stations should not be resolved.
సిబ్బందితో ఎస్పీ అమ్మిరెడ్డి
author img

By

Published : Aug 28, 2020, 12:13 PM IST

పోలీస్ స్టేషన్​లలో భూ తగాదాలు సంబంధించిన కేసులను పరిష్కరించవద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టి చేరుకూరు పోలీస్ స్టేషన్​ని సందర్శించి... రికార్డ్​లను తనిఖీ చేశారు. నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి... బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్​కి వచ్చిన బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. కరోనా పట్ల అప్రమత్తతతో మెలగాలన్నారు. పేకాట, కోడి పందాలు అసాంఘిక కార్యకలపాలు నిర్వహించే వారి పట్ల కఠినంగా వ్యవరించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇవీ చదవండి: కరోనా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.