అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై గుంటూరులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా నేతలు నిరసనలు చేశారు. పెద్ద ఎత్తున్న నినాదాలతో ఆందోళన చేపట్టారు. బీసీల పక్షపాతినని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. బీసీల అభివృద్ధిని తొక్కిపడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ అందులో భాగమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారన్నారు. పులివెందుల రాజకీయాలు, కక్షసాధింపు రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. హిందూ కళాశాల కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు.
ఇవీ చదవండి: గుంటూరు జిల్లాలో కొత్తగా 15 కేసులు.. మొత్తం 617