పనికి ఉపాధిహామీ పథకం కింద పని చేసిన వారికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించాలని ..గుంటూరు తెదేపా నేతలు,కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధిపథకం కింద పని చేసి,బిల్లులు రాక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేసినా, రాష్ట్రప్రభుత్వం ప్రజలకు కూలీలు చెల్లించకుండా, జాప్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఎమ్మెల్యేలు చెబితేనే కూలీలు చెల్సిస్తామని చెప్పడం భావ్యం కాదని ఆయన అన్నారు. వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందని ఆంజనేయులు ఆరోపించారు.
30 న కోడెల సంస్మరణ సభ
మాజీ సభాపతి కోడెల సంస్మరణ సభను ఈ నెల 30 న గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు మైదానంలో తెదేపా నేతలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలంటూ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. కోడెల జ్ఞాపకార్థం నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులో విగ్రహం ఏర్పాటుకు అనుమతించాలని తెదేపా నేతలు కోరారు.
ఇదీ చూడండి: ప్రభుత్వాస్పత్రి సెక్యూరిటీ విధుల బహిష్కరణ...