గుంటూరు వైద్య కళాశాల ప్రొఫెసర్ తమ పట్ల అస్యభ్యకరంగా వ్యవహరిస్తున్నట్లు కళాశాల విద్యార్థినులు కొందరు వైద్య విద్య సంచాలకుడుకి ఫిర్యాదు చేశారు. ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. అందులో భగంగా శుక్రవారం ఆ ప్రొఫెసర్ ను పిలిచి విచారణ చేశారు.
అయితే... ఫిర్యాదులో విద్యార్థినుల పేర్లు, సంతకం లేకపోవడంపై కాస్త అయోమయం ఉన్నా... లేఖపై ఉన్న చిరునామాకు కళాశాల అధికారులు సమాధానం పంపారు. కళాశాలలో విచారణకు హాజరుకావాలని సూచించారు. కాగా.. లేఖ రాసిన వ్యక్తి ఆ చిరునామాలో ఉండడం లేదని లేఖ తిరిగి వచ్చింది. మొత్తం విచారణ వేగవంతంగా చేస్తున్నామని విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వైద్య విద్య ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: