ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లారు ఆ విద్యార్థి. అయితే, అక్కడ చదువుల సాగరంలో ఈదలేక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన మోహనరెడ్డిది సామాన్య రైతు కుటుంబం. తండ్రి గోవిందరెడ్డి వ్యవసాయదారుడు. మోహనరెడ్డి 2017లో ఎంఎస్ చదివేందుకు జర్మనీలోని డస్బర్గ్-ఈస్సెన్ విశ్వవిద్యాలయంలో చేరారు. కోర్సు పూర్తవబోతున్న తరుణంలో కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాకపోవడం అతన్ని ఆందోళనలోకి నెట్టింది. 4 రోజుల క్రితం తండ్రికి ఫోన్ చేసి.. 'నాన్నా.. నేను సరిగ్గా చదవలేకపోతున్నా'నంటూ వాపోయారు. గోవిందరెడ్డి కుమారుడికి ధైర్యం చెప్పారు. బుధవారం తాను నివసిస్తున్న భవంతిలోని నాలుగో అంతస్తు నుంచి దూకి మోహనరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు మరణవార్త తెలుసుకున్న ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి: