ETV Bharat / state

పల్నాడును ప్రశాంతం ఉంచుకుందాం : ఎస్పీ విజయరావు - పల్నాడులో ఎస్పీ విజయరావు టూర్

పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు అన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పల్నాడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.

పల్నాడును ప్రశాంతం ఉంచుకుందాం : ఎస్పీ విజయరావు
author img

By

Published : Oct 19, 2019, 11:26 PM IST

పల్నాడును ప్రశాంతం ఉంచుకుందాం : ఎస్పీ విజయరావు
పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా రెచ్చగొడితే చట్టపరంగా చర్యలు చేపడతామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు హెచ్చరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం... ఆయన పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరు, జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామాల్లో పర్యటించారు. శాంతిభద్రతల పరిస్థితి సమీక్షించారు. ప్రజలు శాంతి, సామరస్యంతో మెలగాలని... శాంతికి విఘాతం కలిగించేలా ఏ కార్యకలాపాలకు పాల్పడొద్దని హితవుపలికారు. ఎవరైనా బయట నుంచి వచ్చి రెచ్చగొడితే వారిపై కేసులు పెడతామన్నారు. తరచూ గొడవలకు దిగేవారిని గుర్తించి వారిపై రౌడీషీట్లు తెరుస్తామని విజయరావు హెచ్చరించారు. విద్యార్థులు చదువులు, ఉద్యోగ పరీక్షలపై దృష్టి సారించాలని, అనవసర వివాదాలకు పోవద్దన్నారు. గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు.

ఇదీ చదవండి :

శిక్షణ ముగిసింది.. ఇక కర్తవ్యమే మిగిలింది..!

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్.....నిండు బాలింతను నా బిడ్డ పురిటీలోనే చనిపోయింది వైద్యులు నన్ను పట్టించుకోవడం లేదని ఓ వివాహిత ఆరోపించింది. గర్భిణీ కాదా అని వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆశలు ఆమె గర్భవతి కాదని వైద్యులు తేల్చిచెప్పారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సంతమువులూరు గ్రామానికి చెందిన వజ్జ అనూష గత ఫిబ్రవరి నుండి నరసరావుపేట లోని శ్రేయ ఇవిఫ్ క్లినిక్ నందు పిల్లల కోసం వైద్యం పొందుతున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం డెలెవెరీ సమయం అని చెప్పి ఆసుపత్రికి రమ్మన్నారని. ఉదయం డెలెవెరీ చేసి మగబిడ్డకు జన్మించినట్లు తెలిపారని ఆమె తెలిపారు. అయితే పుట్టిన వెంటనే బిడ్డ చనిపోవడం వలన ప్రక్కన పెట్టమని తన పరిస్థితి విషమంగా ఉంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి ఆసుపత్రి వారు చెప్పారని ఆమె వివరించింది.

అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తరువాత ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి వజ్జ అనూష ఆశలు గర్భవతి కాదని తేల్చి చెప్పారు. విషియం తెలుసుకొన్న భర్త, బంధువులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 9 నెలలు నుంచి గర్భవతి అంటూ వైద్యం తీసుకుంటున్నామని తీరా ఈరోజు గర్భవతి కాదు అనడం తో బంధువులు భర్త అయోమయానికి గురయ్యారు.

దీనిపై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్.ఎం.వో డాక్టర్. ఆదినారాయణ ని వివరణ కోరగా ఈరోజు మధ్యాహ్నం 3.30. నిమిషాలకు వజ్జ అనూష అనే 25 సంవత్సరాల వివాహిత తమ ఆసుపత్రి కి వచ్చిందన్నారు. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చినట్లు.. పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయిందని ఆమె తెలిపినట్లు డాక్టర్ తెలిపారు. తాను చెప్పిన మాటలలో ఎంతో మేరకు నిజం ఉందని వైద్య పరీక్షలు నిర్వహించగా ఆశలు ఆమె గర్భిణి కాదని పరీక్షలలో తెలిసినట్లు ఆర్.ఎం.ఓ. వివరించారు. దీనిపై విచారణ చేస్తున్నామని డాక్టర్ చెప్పారు.

అనంతరం సినీ ఫక్కీలో నడిచిన ఈ కధని పోలీసులు రాకతో సద్దుమణిగింది. గుంటూరు కొత్తపేట పోలీసులు ఆసుపత్రి వద్దకి వచ్చి ఆమె వివరాలు సేకరించారు. జరిగిన విషియం పై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పిల్లల కోసం తన మతి స్టమితం లేక ఇలా చేసి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

Body:బైట్....డాక్టర్..ఆదినారాయణ, ప్రభుత్వ వైద్య అధికారి ( Rmo )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.