గుంటూరు అర్బన్ పరిధిలో లాక్‌డౌన్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన 16 మంది పోలీసు సిబ్బందిపై అర్బన్ ఎస్పీ రామకృష్ణ చర్యలు తీసుకున్నారు. వారిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ఒక ఏఎస్సైతో పాటు ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 10మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులున్నారు. గుట్కా వ్యాపారులకి సహకరించడం, పేకాట రాయుళ్లతో కుమ్మక్కు కావడం వంటి ఆరోపణలున్నాయి. మరికొందరైతే ద్విచక్ర వాహనదారులు, హోటళ్లు, చికెన్ దుకాణాల వద్ద మూమాళ్లు తీసుకున్నట్లు తేలింది. శాఖాపరమైన విచారణలో వీరి అక్రమాలు రుజువు కావటంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులెవరూ విధుల్లో అలసత్వం, అక్రమాలకు తావివ్వవద్దని ఆయన స్పష్టం చేశారు. వీఆర్ కు వెళ్లిన వారు పాతగుంటూరు, లాలాపేట, అరండల్ పేట, నగరంపాలెం, నల్లపాడు, వట్టిచెరుకూరు, పత్తిపాడు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు. ఒకేసారి 16మందిపై చర్యలు తీసుకోవటంతో ఒక్కసారిగా జిల్లా పోలీసుల్లో కలవరం మొదలైంది.
ఇదీచూడండి. ప్రేయసితో పెళ్లి జరిపించాలని యువకుడు హల్చల్