మీడియా సమావేశంలో గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ రాష్ట్రంలోని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ల భర్తీకి ఈ నెల 6న రాత పరీక్ష జరగనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేశామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ తుళ్లూరులో చెప్పారు. గుంటూరు పరిధిలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు.
కొవిడ్ బాధిత అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఐజీ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని.. అభ్యర్థులంతా గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
పేర్ని నానిపై దాడి కేసు: కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు