ETV Bharat / state

యూకేలో సత్తా చాటిన తెలుగు బిడ్డ...కౌన్సిలర్​గా ఘన విజయం - యుకేలో తెలుగు వ్యక్తి కౌన్సిలర్​గా ఎన్నిక

ఇంగ్లీష్ గడ్డపై జరిగిన ఎన్నికల్లో...తెలుగు యువకుడు సత్తా చాటాడు. గుంటూరు జిల్లాకు చెందిన ముమ్మలనేని అరుణ్ కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొందారు. 20 ఏళ్లుగా యూకేలో ఉంటున్న అరుణ్...వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Guntur person elected councilor  in UK
యూకేలో సత్తా చాటిన తెలుగు బిడ్డ
author img

By

Published : May 10, 2021, 4:44 AM IST

గుంటూరు జిల్లాకు చెందిన ముమ్మలనేని అరుణ్ యూకేలో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్​గా విజయం సాధించారు. హ్యాంప్​షైర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో.. బేజింగ్​ స్టోక్ వ్యాయవ్య నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరపున పోటీచేసి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధిగా గెలిచారు. మే 6వ తేదీ ఎన్నికలు జరగ్గా 7వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. బేజింగ్ స్టోక్ వాయవ్య నియోజకవర్గం నుంచి..తెలుగు వ్యక్తి కౌన్సిలర్​గా గెలవటం ఇదే మొదటిసారి. ఈ పదవిలో నాలుగేళ్లపాటు అరుణ్​ కొనసాగుతారు. అలాగే బారో కౌన్సిల్ సభ్యునిగానూ ఆయన విజయం సాధించారు. అక్కడ..2 రకాల ఎన్నికల్లో పోటీ చేయటంతోపాటు...2 పదవులు ఒకేసారి నిర్వహించే అవకాశం ఆ దేశ రాజ్యాంగం కల్పించింది. రెండు పదవులు పొందడం తెలుగువాడిగా తాను గర్విస్తున్నానని అరుణ్​ తెలిపారు.

అరుణ్ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండలం...మైనేనివారిపాలెం. అతను తండ్రి వెంకట్రావు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి గృహిణిగా ఉన్నారు. అమ్మమ్మ ఊరు మోపర్రులో పాఠశాల విద్యను అభ్యసించిన అరుణ్...హైదరాబాద్​లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో సీఎంసీ సంస్థలో ఉద్యోగిగా చేరి ఆ సంస్థ సిఫార్సు మేరకు 2010లో అరుణ్​ యూకే వెళ్లారు. అక్కడ మోటరోలా కంపెనీలో పని చేశారు. తర్వాత సొంతంగా ఐటీ కంపెనీ ప్రారంభించారు. బ్రిటన్​ రక్షణశాఖ సలహాదారుగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాలు..నిర్వహించారు. కుమారుడు ఎన్నికల్లో విజయం సాధించటంతో తల్లి కృష్ణ కుమారి సంతోషం వ్యక్తం చేశారు.

యూకేలో కాకుండా తాను చదివిన మోపర్రు పాఠశాలలో అరుణ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

ఇదీచదవండి

అనుమతి రాగానే.. అందరికీ వ్యాక్సినేషన్: అనిల్ సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.