ETV Bharat / state

కార్మికుల్లో ఒత్తిడి తొలగిస్తూ.. కొత్త ఉత్సాహం పెంచుతూ.. - Guntur municipal authorities have launched an innovative program

పారిశుద్ధ్య కార్మికుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆటాపాట ద్వారా కార్మికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. రోజూ పని మొదలుపెట్టే ముందు వారితో చిన్నపాటి నృత్యాలు, తేలికపాటి వ్యాయామాలు చేయించటం ద్వారా మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు.

వినూత్న కార్యక్రమం
వినూత్న కార్యక్రమం
author img

By

Published : Oct 2, 2021, 6:04 AM IST

పారిశుద్ధ్య కార్మికుల్లో ఒత్తిడి తగ్గించేందుకు వినూత్న కార్యక్రమం

ఇటీవల ప్రాచుర్యం పొందిన బుల్లెట్ బండి పాటకు ఉల్లాసంగా స్టెప్పులేస్తున్న వీరంతా.. గుంటూరు పారిశుద్ధ్య కార్మికులు. కొవిడ్ కాలం మొదలైనప్పటి నుంచి కొంత ఒత్తిడితోనే కార్మికులు పని చేస్తున్నారు. చాలామంది కరోనా బారిన కూడా పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆందోళన తొలగించి, కార్మికుల్లో ఉత్సాహం నింపేందుకు నగరపాలక సంస్థ అధికారులు ఆటాపాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ విధుల్లోకి రాగానే ఆటపాటలతోపాటు ఏరోబిక్స్ కూడా చేయిస్తున్నారు.

గుంటూరు నగరపాలక సంస్థలో మూడునెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా రెండు డివిజన్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి.. ప్రస్తుతం 22 డివిజన్లలో నిర్వహిస్తున్నారు. నృత్యాలు చేయించడం వల్ల ఒత్తిడిని జయిచి, ఉత్తేజంతో పని చేస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కార్మికులు సంతోషంగా పనిలో నిమగ్నమయ్యేలా చేయడమే ఆటాపాట కార్యక్రమ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత కార్మికులు సమయానికి వస్తున్నారు. హాజరు శాతం పెరిగింది. పనిలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అందువల్ల నగరంలోని అన్ని డివిజన్లకూ విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో భద్రత చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.