నిరాశ్రయుల ఆకలి తీర్చే దాతలు ఎంతోమంది ఉండొచ్ఛు. కరోనా కష్ట కాలంలో ఓ యువకుడు మూగజీవాలకు మేత అందిస్తూ ఔదార్యాన్ని చాటుతున్నాడు. గుంటూరు నెహ్రూనగర్‌లోనున్న గోశాలకు లాక్‌డౌన్‌కి ముందు నిత్యం ఎవరో ఒకరు ఆవులకు దాణా ఇచ్చేవారు. ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక యువకుడు నగర శివారునున్న హోల్‌సేల్ మార్కెట్ వద్ద పడేసిన కూరగాయలను తీసుకొచ్చి ఆవుల ఆకలి తీరుస్తున్నాడు.
ఇదీ చదవండి... రాష్ట్రంపై కరోనా పంజా.. 1100 చేరువలో కేసులు