ETV Bharat / state

'ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై అనర్హత వేటు వేయండి'

న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని... గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ రాష్ట్రపతికి, గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. కోర్టులు, న్యాయమూర్తులు జగన్​ను ఏమీ చేయలేరంటూ రవీంద్రబాబు వ్యాఖ్యానించారని.. న్యాయవ్యవస్థపై పెద్ద కుట్ర జరుగుతోందని... అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

guntur lawayer lakshmi narayana complain to governor on mlc ravindrababu
లక్ష్మీనారాయణ, న్యాయవాది
author img

By

Published : Aug 13, 2020, 12:46 PM IST

Updated : Aug 13, 2020, 5:29 PM IST

న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడారంటూ.. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని... గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ రాష్ట్రపతికి, గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన ఫిర్యాదు చేశారు.

కోర్టులు, న్యాయమూర్తులు జగన్​ను ఏమీ చేయలేరంటూ రవీంద్రబాబు వ్యాఖ్యానించారని.. న్యాయవ్యవస్థపై పెద్ద కుట్ర జరుగుతోందని... అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో న్యాయస్థానాలను కుట్రపూరితంగా విమర్శిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ

కోర్టుల ప్రతిష్ఠను దెబ్బతీసే లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని... అందుకే రవీంద్రబాబుని ఎమ్మెల్సీగా అనర్హునిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న పెద్దలు ఎవరో తేల్చాలని కోరారు. గవర్నర్​ను నేరుగా కలిసి ఫిర్యాదు చేసేందుకు అనుమతి కోరానన్నారు.

ఇవీ చదవండి:

'మా నాన్న కరోనాతో చనిపోలేదు.. దయచేసి సాయం చేయండి'

Last Updated : Aug 13, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.